ఓ మనసా!
ఎగిరిపడకే
మనసా
వేసారిపోకే
మనసా
చిందులేయకే
మనసా
చతికిలబడకే
మనసా
గంతులేయకే
మనసా
గాయపడకే
మనసా
తుళ్ళితుళ్ళిపడకే
మనసా
తొణికిసలాడకే
మనసా
బెంగపడకే
మనసా
భంగపడకే
మనసా
భీతిచెందకే
మనసా
బెదిరిపారిపోకే
మనసా
దుస్సాహసాలుచేయకే
మనసా
దుర్గుణాలువీడవే
మనసా
ఊయలూగకే
మనసా
ఊపుకుజారిక్రిందపడకే
మనసా
ఊగిసలాడకే
మనసా
ఊరకే నిర్ణయాలుమార్చకే
మనసా
నీతిగాయుండవే
మనసా
నిజాయతీగా బ్రతకవే
మనసా
ముందుకుసాగవే
మనసా
మంచివిజయాలుపొందవే
మనసా
పేరుప్రఖ్యాతులుపొందవే
మనసా
ప్రక్కదారులు పట్టకే
మనసా
ప్రేమానురాగాలు చూపవే
మనసా
బాంధవ్యాలను తెంచుకోకే
మనసా
అందాలుచూడవే
మనసా
ఆనందాలుపొందవే
మనసా
కలంపట్టి కవితలువ్రాయవే
మనసా
కలకాలం సాహిత్యలోకంలోనిలిచిపోవే
మనసా
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
నా ఆలోచనలే
నా ఆస్తి
నా మనసే
నా మార్గదర్శి
పాఠకులసంతోషం
నాధ్యేయం
పాఠకులప్రోత్సాహం
నాబలం
Comments
Post a Comment