నామల్లి ముచ్చట్లు


వచ్చింది

మల్లెలకాలం

తెచ్చింది

వసంతమాసం


పూచింది

మల్లెచెట్టు

పిలిచింది

రమ్మనితోడుకు


తొడిగింది

మల్లెమొగ్గ

విచ్చుకుంది

సంతోషముగ


నచ్చింది

మల్లెబాల

ముట్టింది

మనసుమూల


వీచింది

మల్లెపరిమళం

తట్టింది

అంతరంగం


చూపింది

మల్లెపొంకం

ఇచ్చింది

మహదానందం


విప్పింది

మల్లెరేకులు

ఒలకబోసింది

వయ్యారాలు


మురిపించింది

మల్లెరంగు

చిందించింది

సూర్యునివెలుగు


గుచ్చింది

మల్లెకన్య

గుండెలోన

గుణపాన్ని


వలచింది

మల్లెభామ

ముంచింది

ప్రేమలోన


అల్లింది

మల్లెమాల

అలంకరించింది

మెడలోన


ముచ్చటైన

మల్లెతీగ

ప్రాకింది

పైకిపైపైకి


మంచమెక్కింది

మల్లెపూవు

నలిగిపోయింది

నసుగుడుమాని


మల్లియంటే

మల్లెకాదు

మనసునుదోచిన

మంచిభామ


పువ్వంటే

పువ్వుకాదు

ప్రేమించిన

పల్లెపడుచు


మల్లెపూలుతెస్తా

మల్లికొప్పులోపెడతా

మళ్ళీమళ్ళీచూస్తా

మల్లెమనసునుదోస్తా


మల్లెకన్నతెల్లనిది

మల్లిమనసు

మల్లెకన్నమెత్తనిది

మల్లితనువు


మల్లెరంగు చీరనుతెస్తా

మల్లిని కట్టుకోనమంటా

మల్లెపువ్వుల రవికనుతెస్తా

మల్లిని తొడుగుకోనమంటా


మల్లికోరితే

మనసిస్తా

ముద్దులడిగితే

మురిపిస్తా


మరిమల్లెయంటే

మరుమల్లెకాదు

ముగ్ధమనోహరి

మానసచోరి


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం



Comments

Popular posts from this blog