ఎరిగి మసలుకో!
ఏపుట్టలో
ఏపామున్నదో
ఎవరికెరుక
పెద్దకర్రనుపట్టుకొని సదా సంరక్షించుకో
ఏదిక్కునుండి
ఏఆలోచనవస్తుందో
ఎవరికెరుక
అన్నివైపులనుండి గాలిని ప్రసరించనీ
ఏబుర్రలో
ఏతలపున్నదో
ఎవరికెరుక
కీడెంచి మేలెంచటం నేర్చుకో
ఏనిమిషానికి
ఏమిజరుగునో
ఎవరికెరుక
చేసుకున్నవాళ్ళకు చేసుకున్నంతని తెలుసుకో
ఎవరిపాపం
ఎప్పుడుపండుతుందో
ఎవరికెరుక
కర్మఫలం అనుభవించక తప్పదనుకో
ఎవరిపుణ్యం
ఎప్పుడుఫలిస్తుందో
ఎవరికెరుక
చేసినకర్మం చెడనిపదార్ధమని తలచుకో
ఎవరికి
ఎవరు రాసిపెట్టారో
ఎవరికెరుక
వివాహాలు స్వర్గంలో నిర్ణయించబడ్డాయనితెలుసుకో
ఎప్పుడు వానపడుతుందో
ఎప్పుడు ప్రాణంపోతుందో
ఎవరికెరుక
అన్నిటికీ తయారయి మసలుకో
ఏక్షణాన లక్ష్మీదేవి
ఎవరిని వరిస్తుందో
ఎవరికెరుక
స్వాగితించటానికి సిద్ధముగాయుండి నడుచుకో
ఏకవినుండి
ఏకవిత వస్తుందో
ఎవరికెరుక
సమయంకోసం వేచిచూడు ఓర్పుతో
సర్వం
సర్వంతర్యామైన
సర్వేశ్వరునకెరుక
స్వామివారిని శరణంకోరదాం సుఖాలనుపొందుదాం
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment