ఎందుకు చెలీ!
అంతరంగాన ప్రవహించే
ఆలోచనలకు
అడ్డుకట్టవేస్తావెందుకు
అలాగే పరుగెత్తనియ్యవెందుకు
కలిగిన కోర్కెలను
కత్తిరిస్తావెందుకు
కమ్మగా తీర్చుకొని
కుతూహలపడవెందుకు
పైటను
ప్రక్కకుజారకుండా
పట్టుకుంటావెందుకు
ప్రయాసపడతావెందుకు
మోముకు
ముసుగేస్తావెందుకు
ముచ్చటలాడి
మురిపించవెందుకు
మూతిని
ముడుచుకుంటావెందుకు
మాటలాడి మత్తుచల్లి
మయిమరిపించవెందుకు
కళ్ళలోని కాంతులను
కాంచనీయవెందుకు
కనులముందుండక
కనుమరుగవుతావెందుకు
చిరునవ్వులు
చిందవెందుకు
చతురోక్తులు
సంధించవెందుకు
భావాలను
బయటపెట్టవెందుకు
బ్రతుకును
పండించవెందుకు
మౌనంవహించి
మదనపడతావెందుకు
మదిలోనిమాటలను
ముందుంచవెందుకు
అపనమ్మకంతో
అలమటిస్తావెందుకు
అంతిమనిర్ణయంతీసుకొని
అడుగులేయవెందుకు
కాయో పండో
చెప్పవెందుకు చెలి
అటో ఇటో
తేల్చవెందుకు చెలి
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment