సాయంసంధ్యను చూడు


అదిగో

అటు పడమటదిక్కునుచూడు

అంతరంగానికి ఆనందమివ్వు


ఆకాశానికి

అన్ని అందాలు

ఎవరిచ్చారోచూడు


అంతరిక్షానికి

అన్ని రంగులు

ఎవరు అద్దారోచూడు


అస్తమిస్తూ 

అక్కడ కొండల్లోకి 

ఎవరెళ్తున్నారో చూడు


వెళ్తూ వెళ్తూ

విన్నును గిల్లిగిల్లి

వెళ్తున్నదెవరో చూడు


నింగి బుగ్గలు

సిగ్గుతో

ఎర్రబడ్డాయెందుకో చూడు


వెలుగును

వెన్నెలదొరకిచ్చి 

ఎవరు ఎవరిదగ్గరకెళ్తున్నారో చూడు


విశ్వప్రయాణంతో

విసిగివేసారి

విశ్రాంతికి నిష్క్రమిస్తున్నదెవరో చూడు


తళతళలాడే

తారకలు

తళుక్కుమంటున్నాయెందుకో చూడు


వెండి మబ్బులు

వివిధరూపాలలో

తేలిపోతున్నాయెందుకో చూడు


సూర్యదేవరా

నమస్కారమయ్యా

సదా

మమ్మలను కాపాడుమయ్యా


తిరిగి ఉదయానికి

తూర్పున ఉదయించి

తెల్లవార్చవయ్యా

జగాన్ని మేలుకొలపవయ్యా


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం



Comments

Popular posts from this blog