కవిగారి అంతరంగం


నిత్యం

కలలుకంటున్నా

కథావస్తువుకోసం


రోజూ

కల్పనలుచేస్తున్నా

కవితను కళ్ళముందుంచటంకోసం


ప్రతిదినం

ఆలోచనలు పారిస్తున్నా

అద్భుతకవితను సృష్టించటంకోసం


ప్రతిరాత్రి

కవితాకన్యకకవ్వింపులకు గురవుతుంటా

కలాన్నిపట్టి వ్రాయటంకోసం


ప్రతినిత్యం

అందాలను వీక్షిస్తుంటా

అనుభవించి వర్ణించటంకోసం


అనునిత్యం

ఆనందంకొరకు ఎదురుచూస్తుంటా

అందరితో పంచుకోవటంకోసం


విషయం దొరికితే

కవితొకటి పుట్టినట్లే

అక్షరాలు దొర్లితే

అంతరంగాన్ని తట్టినట్లే


పదాలు దొర్లితే

పరమానందం పంచినట్లే

పాఠకులు చదివితే

ప్రతిస్పందనలు చేసినట్లే


ఆలశ్యంచేయక

అన్యదాభావించక

ఆస్వాదించండి

ఆనందించండి


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం



Comments

Popular posts from this blog