కవులకు వందనాలు కవితలకు నీరాజనాలు
కవులున్నారు
కంటకనిపెట్టు
వారివ్రాతలను
వంటికిపట్టించు
కల్పనలను
కాగితాలకెక్కిస్తారు
ఊహలలోకానికి తీసుకెళ్ళి
ఉచితంగా ఊరేగిస్తారు
ఆవులించావంటే
పేగులు లెక్కేస్తారు
మాట్లాడావంటే
మనసును పట్టేస్తారు
విషయం దొరికితే
వినూతనకవిత వ్రాసేస్తారు
తీగ చిక్కితే
డొంకను లాగేస్తారు
భావం పుడితే
పుటల కెక్కిస్తారు
పాఠకులు చదివితే
మస్తిష్కములోనికి దూరేస్తారు
అక్షరాలు దొర్లితే
అంతరంగాన్ని ఆవిష్కరిస్తారు
అందరి మదులను
అట్లే పట్టేస్తారు
పదాలు పారితే
పలుకవితలు పండిస్తారు
ప్రాసయతులు కుదిరితే
పెక్కుపద్యాలు వ్రాసిపఠిస్తారు
కవివని పొగిడితే
ఒంటికాలుపై ఎగురుతారు
బేషుయని ప్రశంసిస్తే
వేషాలెన్నో వేసిచూపిస్తారు
కవిరాజని కీర్తిస్తే
కవనాన్ని సాగిస్తారు
కవిసమ్మేళనానికి పిలిస్తేపాల్గొని
సన్మానసత్కారాలు స్వీకరిస్తారు
కవులకు
వందనాలు
కవితలకు
నీరాజనాలు
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment