నా పూలప్రేమ
పువ్వులతోటలో
పచార్లు చేయాలనియున్నది
పూలబాలలతో
పరిచయాలు పెంచుకోవాలనియున్నది
పువ్వులను
పరికించాలనియున్నది
పులకరించి
పరవశించి పోవాలనియున్నది
పువ్వులను
ప్రక్కకు పిలవాలనియున్నది
పరిమళాలను
పీల్చాలనియున్నది
పువ్వులను
పలకరించాలనియున్నది
పరిహాసాలాడి
పొంగిపోవాలనియున్నది
పువ్వులతో
స్నేహం చెయ్యా లనియున్నది
పువ్వులతో
సమయం గడపాలనియున్నది
పువ్వులతో
ఆటలను ఆడాలనియున్నది
పూలపై
పాటలు పాడాలనియున్నది
పువ్వుల సొగసులను
చూడాలనియున్నది
పూలనుండి ఆనందాలను
పొందాలనియున్నది
పువ్వులను
ప్రేయసికివ్వాలనియున్నది
ప్రేమాభిమానాలను
పొంది పదిలపరచుకోవాలనియున్నది
పువ్వులపై కవితలను
వ్రాయాలనియున్నది
పువ్వులమనసులను
దోచుకోవాలనియున్నది
పువ్వులను
మాలలుగా అల్లాలనియున్నది
సాహితిమెడలోన
అలంకరించి ఆహ్లాదపడాలనియున్నది
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment