నా పువ్వుకబుర్లు
పువ్వును
పలకరిస్తే
పకపక నవ్వులతో
ప్రతిస్పందించింది
పువ్వును
పట్టుకుంటే
పులకరించి
పరవశించింది
పువ్వును
ముద్దాడితే
సిగ్గుపడింది
సంతసపడింది
పువ్వు
పరిమళాన్ని
పీల్చితే
పొంగిపోయింది
పువ్వును
చేతిలోకి తీసుకుంటే
ఒదిగిపోయి
వంటిని ఆహ్లాదపరచింది
పువ్వుతో
ఆడితే
తానూ పాల్గొని
తృప్తినిచ్చింది
పువ్వును
రమ్మంటే
సంతసపడి
చెయ్యిపట్టుకొని ఇంటికినడిచింది
పువ్వును
ప్రేమిస్తా
హృదయంలో
దాచుకుంటా
పువ్వులతో
పయనిస్తా
పువ్వులే
ప్రాణమనుకుంటా
పువ్వుల
కవితలు వ్రాస్తా
పాఠకులను
పరవశింపజేస్తా
పూబాలలే
ప్రాణమిత్రులు
పూబోడులే
ప్రకృతి ప్రసాదాలు
పువ్వులే
నాలోకం
పువ్వులే
నాప్రాణం
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment