వాడినపువ్వును వికసించనీ!
ప్రేమను
పరిహాసంచేస్తావా
నమ్మకాన్ని
వమ్ముచేస్తావా
నువ్వు ఏమని
అనుకున్నావు
నన్ను ఎమని
అనుకున్నావు
పిల్లదాన్ని
అనుకున్నావా
పిచ్చిదాన్ని
అనుకున్నావా
మోసకారి
ననుకున్నావా
మాటకారి
ననుకున్నావా
ఆట
ఆడిద్దామనుకున్నావా
వెంట
తిప్పించుకుందామనుకున్నావా
అంతా
నాటకమనుకున్నావా
అన్నీ
అబద్ధాలనుకున్నావా
ఘోరంగా
వంచనచేస్తావా
మానసికంగా
హింసకుగురిచేస్తావా
అసలెందుకు
కలిశావు
నన్నెందుకు
వలచావు
మనసెందుకు
దోచావు
బంధాన్నెందుకు
కలిపావు
మాటలెందుకు
చెప్పావు
మనసునెందుకు
దోచావు
పన్నీరును
పైనచల్లతానన్నావు
కన్నీరును
కార్పిస్తున్నావు
గుండెకు
గాయంచేశావు
వంటికి
నిప్పునుపెట్టావు
నిన్ను
మరువలేకున్నాను
నిన్ను
వీడలేకున్నాను
ఇప్పటికయినా
మనసుమారదా
ఇద్దరిమొకటిగా
ముందుకెళ్ళలేమా
ప్రణయాన్ని
విఫలంచేస్తావా
జీవితాన్ని
నాశనంచేస్తావా
చెలికాడా
ఎండినచెట్టును
చిగురించనీ
వాడినపూవును
వికసంచనీ
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment