ఆపువ్వును చూడు


ఆపుష్పం

ఎంతచక్కనో

ఆపరిమళం

ఎంతఘాటో


ఆరూపు

ఎంతవింతయో

ఆరంగు

ఎంతవిచిత్రమో


ఆతేనెకు

ఎంతతీపో

ఆతేటికి

ఎంతానందమో


ఆపువ్వుకు

ఎంతప్రేమో 

ఆజీవితం

ఎంతధన్యమో


ఆతోటకి

ఎంతపచ్చదనమో

ఆవాతావరణం

ఎంతాహ్లాదకరమో


వదలను వదలను

ఆపువ్వును వదలను

కదలను కదలను

ఆపువ్వునుండి ప్రక్కకుకదలను


పూబాలతో

ఆటలాడుతా

పూలకన్యతో

పాటలుపాడుతా


చేతిలోకి

తీసుకుంటా

సంతోషంలో

తేలిపోతా


మనసులో

దాచుకుంటా

సహవాసములో

పొంగిపోతా


పువ్వులలోకంలో

పయనిస్తా

ఆనందలోకంలో

విహరిస్తా


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం


నాలుగురోజులు

విషాదకవితలు

విరచించా

సున్నితమనస్కులకు

బాధకలిగించా


ఇకముందు

అందాలను

చూపిస్తా

ఆనందాన్ని

కలిగిస్తా


ఇట్లు

మీ గుండ్లపల్లి

మీ రాజేంద్ర

మీ ప్రసాద్

మీ కవి


చివరగా

పాఠకులకు

ధన్యవాదాలు

వ్యాఖ్యాతలకు

అభివందనాలు


(ఏ పువ్వును ముఖచిత్రంగా పెట్టాలా అని బాగా ఆలోచించి, చివరకు దాలియా పువ్వును ఎన్నుకున్నాను. మీరు చూచి మురిసిపోతారనుకుంటున్నాను.)



Comments

Popular posts from this blog