ఆడవాళ్ళూ మీకు జోహార్లు!
ఎక్కడచూచినా
ఎందులోనయినా
అమ్మాయిలు ముందుకెళ్తున్నారు
అబ్బయిలెందుకో వెనుకబడుతున్నారు
చదువుసంధ్యల్లో
ఉద్యోగసద్యోగాల్లో
ఆడవాళ్ళు దూసుకెళ్తున్నారు
మగవాళ్ళెందుకో వెనుకంజవేస్తున్నారు
అందంలో ఆనందంలో
నవ్వటంలో నవ్వించటంలో
యువతులు ముందుంటున్నారు
యువకులెందుకో వెనుకనుంటున్నారు
బట్టల్లో నగల్లో
సోకుల్లో సందడిలో
స్త్రీలు ముందువరసలో ఉంటున్నారు
పురుషులెందుకో వెనుకవరుసలో ఉంటున్నారు
ఆటల్లో పాటల్లో
మాటల్లో చేతల్లో
కుర్రపిల్లలు ముందుకెళ్తుంటే
కుర్రోళ్ళెందుకో పోటీబడలేకపోతున్నారు
ఆశయాల్లో అనుభవాల్లో
ఆలోచనలలో ఆచరించటంలో
మహిళలు ఉన్నతిలోకొస్తుంటే
మగవాళ్ళెందుకో దిగజారిపోతున్నారు
ప్రేమల్లో బంధాల్లో
కాపురాల్లో జీవితాల్లో
మహిళామణులు ముందుంటుంటే
మగవారెందుకో సరితూగలేకపోతున్నారు
బరువు బాధ్యతల్లో
కుటుంబపోషణలో పెత్తనంలో
భార్యాభర్తలొకటయినా
భర్తలెందుకో బాగావెనుకబడ్డారు
అమ్మలకన్నా
నాన్నలు వెనుకబడ్డారు
సోదరీమణులుకన్నా
సోదరులు బాగావెనుకబడ్డారు
కవితల్లో కధల్లో
సమూహాల్లో వ్యాఖ్యానాల్లో
ఆడవారు అదరకొడుతుంటే
మగవాళ్ళెందుకో వెనుకబడ్డారు
ఆడవాళ్ళు
మీకు జోహార్లు
అన్నీ సాధిస్తున్నారు
అన్నిటా పురుషులను అధికమిస్తున్నారు
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment