చిన్నదానిసొగసు చూడతరమా!
చిన్నది
చెంగావిచీరకట్టింది
చక్కగా
చింతపువ్వులరవికనుతొడిగింది
చిన్నది
వాలుజడను వేసుకొన్నది
చూపులతో
వలపువలను విసిరింది
చిన్నది
చిరుమల్లెపూలుపెట్టుకున్నది
చక్కదనంతో
చిత్తాన్నిదోచుకున్నది
చిన్నది
చంద్రునివలెవెలుగుచున్నది
సోయగాలను
చూపిమురిపిస్తున్నది
చిన్నది
చేలోనకెళ్ళింది
చిరునవ్వులను
చిందించింది
చిన్నది
చింతతోపుకెళ్ళినది
చల్లగాలికి
సేదతీరితోడునుకోరింది
చిన్నది
చిటికెలేస్తున్నది
సావధానపరచి
సరసాలాడుచున్నది
చిన్నది
ఆడుతున్నది
చక్కగా
పాడుతున్నది
చిన్నది
వయసులోనున్నది
సొగసులను
చూపిస్తున్నది
చిన్నది
పరువాలతో పరవశించిపోవుచున్నది
చెలికాన్ని
ప్రేమలోనికి దించాలనిచూస్తున్నది
చిన్నది
చెయ్యెత్తిచూపుతున్నది
చెంతకురమ్మని
సైగలుచేస్తున్నది
చిన్నది
చెంతకుచేరుతున్నది
చతురోక్తులను
సూటిగావిసురుతున్నది
చిన్నదానితో
మాట్లాడాల్సిందే
తోడుకు
తెచ్చుకోవాల్సిందే
చిన్నదాని
మెడవంచాల్సిందె
నలుగురిముందు
తాళికట్టాల్సిందే
పెద్దలతో
అక్షింతలు చల్లించుకోవాల్సిందే
అందరి
దీవెనలు పొందాల్సిందే
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment