అందమా నీవెక్కడా!


అందమా 

నా డెందమా

నా చంద్రమా

నా బంధమా


అందమా

నా ఆనందమా

నా కమ్మదనమా

నా కంటిదృశ్యమా


అందమా

నా వెలుగా

నా మార్గమా

నా లక్ష్యమా


అందమా

నీవెక్కడా

నీతావులెక్కడా

నీచిరునామా తెలుపుమా


అనగానే 

అందమొచ్చె

సమాధానమిచ్చె

సందేహమిలాతీర్చే


ఇక్కడా అక్కడా

అనేసందేహం వలదుసుమా

ఎందెందు వెదికిచూచినా 

అందందే తప్పక ఉంటా


పువ్వుల్లో ఉంటా

పరికించేవారికెల్లా

పొంకాలుచూపుతుంటా

పులకరిస్తుంటా


అతివల్లో ఉంటా

అణిగిమణిగి ఉంటా

అందుకోగలిగేవారినెల్లా 

ఆనందపరుస్తుంటా


పసిపాపల్లో ఉంటా

పిల్లలపలుకులలో ఉంటా

ప్రక్కనున్నవారిని

పరవశపరుస్తుంటా


నింగిలో ఉంటా

నీలిమబ్బుల్లో ఉంటా

మేఘాల్లో ఉంటా

హరివిల్లులో ఉంటా


చంద్రునిలో ఉంటా

చక్కనివెన్నెలలో ఉంటా

చుక్కల తళతళలలో ఉంటా

చూపరులను సంతసపెడుతుంటా


పుడమిపై ఉంటా

పచ్చనిచెట్లలో ఉంటా

పంటపొలాల్లో ఉంటా

ప్రకృతిలో ఉంటా


ప్రభాత సూర్యునిలో ఉంటా

అరుణకిరణాలలో ఉంటా

అస్తమించే రవిరంగులలో ఉంటా

విశ్వమంతా వ్యాపించి ఉంటా


కొండల్లో ఉంటా 

కోనల్లో ఉంటా

అరణ్యాలలో ఉంటా

సెలయేర్లలో ఉంటా


నదినీటిలో ఉంటా

సరస్సులలో ఉంటా

సముద్రాల్లో ఉంటా

వాటితీరాలలో ఉంటా


కళ్ళల్లో ఉంటా

కనగలిగేవారికి కనపడతా

కళకళలాడుతుంటా

కనువిందులు చేస్తుంటా


మనసులలో ఉంటా

మేధస్సులో ఉంటా

మురిపిస్తుంటా

మయిమరిపిస్తుంటా


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం


అందాన్ని అనుభవిస్తా

కళ్ళల్లో పెట్టుకుంటా

హృదయంలో దాచుకుంటా

కవితలలో కనబరుస్తుంటా


అందాన్ని

అందరికి 

అందిస్తుంటా

ఆహ్లాదపరుస్తుంటా


అందాలను

చూపుతా

ఆనందాలను

ఇస్తా



Comments

Popular posts from this blog