కవితాదర్పణం
కవిత
ఒక దర్పణం
దొరుకుట
ఒక అదృష్టం
కవితలో
కవిగారు కనబడతారు
కమ్మని విషయాలను
కనులముందు పెడతారు
కవితలో
కవిమోమును చూడవచ్చు
కవిరూపాన్ని
కుంచెపట్టి గీయవచ్చు
కవితలో
కవిమనసునుకాంచవచ్చు
కవిహృదయాన్ని
కనుగొనవచ్చు
కవితలో
అందాలనుచూడవచ్చు
ఆనందాన్ని
పొందవచ్చు
కవిత
కవ్విస్తుంది
కళ్ళలో
కాపురంపెడుతుంది
మంచికవిత
మనసులో నిలుస్తుంది
సుకవిత
చిరకాలం చిత్తాన్నితొలుస్తుంది
కవితాదర్పణాన్ని
అందుకోండి
కవిగారిమనోభావాలను
వీక్షించండి
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment