ఓ జాలిలేని జవరాలా!
(విరహగీతం)
ఓ...
జాలిలేని జవరాలా
చెంతకుచేరవా
ఓ...
ప్రేమలేని ప్రియురాలా
సంతసపరచవా
నన్నెందుకు కలిశావు
నువ్వెందుకు వలచావు
మాటలెందుకు కలిపావు
మనసెందుకు దోచావు
కఠినాత్మురాలువయితే
కంటకాలను గుండెలోగుచ్చకపోయావా
వలపేలేనిదానివయితే
వలనువిసరకుండా ఉండకపోయావా
ఎమయ్యిందీ
ఇప్పుడేమయ్యిందీ
ఎక్కడకెళ్ళావూ
ఇప్పుడెక్కడకెళ్ళావూ
నీ ఙ్ఞాపకాలను
నెమరేసుకుంటున్నా
నీ కోసం
నిరీక్షిస్తున్నా
రెక్కలుంటే
పక్షిలాగా
గాలిలో ఎగిరి వెదికి
నీదగ్గర వ్రాలేవాడిని
పువ్వులొచ్చి నీసమాచారమిస్తె
ప్రేమసందేశాన్ని
పూలలోదాచి
పంపేవాడిని
పావురాన్నినువ్వుపంపితే
ప్రేమలేఖను
పదిలంగా
ప్రీతితోనీకుచేర్చేవాడిని
మబ్బులునీజాడనుచెబితే
మనోవేదనను
మాటలలోకిమార్చి
మాటుగాచేర్చేవాడిని
వెన్నెలరేడు నీదారినిచూపితే
విరహవేదనను
వివరంగావర్ణించి
వేగంగా నీకు అందించేవాడిని
కవిగా మారా
కమ్మగా వ్రాశా
కవితను పంపుతున్నా
కనికరించి దరిచేరవా చెలియా
ఫేసుబుక్కులో
పలకరించుకుందామా
వాట్సప్పులో
వీడియోలో చూసుకుందామా సఖియా
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం

Comments
Post a Comment