అక్షరపోరాటకుడు
ఎవరనుకున్నారు
అతనెవరనుకున్నారు
కలాన్నికత్తిలాపట్టేవాడు
అక్షరపోరాటంచేసేవాడు
యదర్ధవాది
లోకవిరోధి
కనిపించనివాడు
వినిపించేవాడు
మాటలు
ముక్కుసూటిగామాట్లాడేవాడు
చేతలు
చెప్పినట్లుగాచేసేవాడు
అబద్ధలాడేవారిని
ఎండగట్టేవాడు
అన్యాయాలుచేసేవారిని
నిలదీసేవాడు
చెప్పినవాటికి
కట్టుబడేవాడు
సహాయంకోరినవారికి
తోడుగాయుండేవాడు
నిజాయితీగా
మాట్లాడేవాడు
న్యాయమార్గాన్ని
అనుసరించేవాడు
నిజాన్ని
నిష్ఠూరంలేకుండా చెప్పేవాడు
నీతిని
నలుగురికి బోధించేవాడు
ద్రోహుల
ఆటలుకట్టించేవాడు
మోసకారుల
మెడలువంచేవాడు
నిప్పుతోనైనా
చెలగాటమాడేవాడు
జీవితాన్నయినా
పణంగాపెట్టేవాడు
కర్తవ్యాన్ని
నిర్వహించేవాడు
ఫలితాలను
అందరికీపంచేవాడు
చేతులు
కలుపుదాం
చెడును
నిర్మూలిద్దాం
సహకారాన్ని
అందిద్దాం
సమాజాన్ని
అభివృద్ధిచేద్దాం
కవులను
ప్రోత్సహిద్దాం
కవితలను
ఆస్వాదిద్దాం
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment