కవికోకిలలు - నాడు నేడు రేపు


అప్పుడు

చెట్టుమాటున

ఒక్క కోకిల

చక్కగా

పాడుచుండె


ఆకులలోన

అణిగి మణిగి

కవితకోకిల

కూయుచుండె


ఇప్పుడు

కూసికూసి అలసిన

కోకిలమ్మలు

జనాలకు గళాలనరువునిచ్చి

జనారణ్యాలచేరి వినుచుండె


పాటనేర్చిన

పెక్కు కవికోకిలలుకూడి

పరవశించి

పాడుచుండె


రేపటిరోజులందు

కొత్త శకానికి

కొత్త కవులుపుట్టు

కొత్త భావాలతోడ

కొత్తకవితలు పాడు


అక్షర సేద్యగాళ్ళు

అక్షరవిన్యాసాలు చూపు

అక్షరపోరాటాలు చేయు

అక్షరగానామృతాన్ని చిమ్ము


కవులకు స్వాగతం

కవులకలాలకు స్వాగతం

కవులకవితలకు స్వాగతం

కవులగళాలకు స్వాగతం


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం



Comments

Popular posts from this blog