పూలంటే పూలుకాదు నాహృదయపు ప్రతిబింబాలు
ఓచెట్టు
విరబూసింది
ఓనాడునాకు
పూదానంచేసింది
ఆచెట్టు
సంతసించింది
ఆపూలు
నాపూలయ్యాయి
నాపూలు
నావెంటవచ్చాయి
నాకుతోడుగా
నిలిచాయి
నాపూలు
ననుప్రేమించాయి
నాపై
ఆప్యాయతచూపించాయి
నాపూలు
నాప్రక్కకుచేరాయి
నాతో
సరసాలాడాయి
నాపూలు
విచ్చుకున్నాయి
నన్ను
చూడమన్నాయి
నాపూలు
అందచందాలుచూపాయి
నన్ను
ఆనందపరచాయి
నాపూలు
ప్రకాశించాయి
నామోమును
వెలిగించాయి
నాపూలు
నక్కాయి
నన్ను
వెతికిపట్టుకోమన్నాయి
నాపూలు
మొక్కాయి
నన్ను
వరాలివ్వమన్నాయి
నాపూలు
నవ్వాయి
నన్ను
సంతసపరచాయి
నాపూలు
పరిమళించాయి
నన్ను
పరవశింపజేశాయి
నాపూలు
నాట్యమాడాయి
నన్ను
మురిపించాయి
నాపూలు
ఆటలాడాయి
నన్ను
ఆహ్లాదపరచాయి
నాపూలు
పాడాయి
నన్ను
పులకరింపజేశాయి
నాపూలే
నావెలుగులు
నాపూలే
నాప్రోత్సాహకాలు
పూలంటే
పూలూకాదు
నాహృదయపు
ప్రతిబింబాలు
పూలుప్రకృతిప్రసాదించిన
ప్రేమప్రతీకలు
నాకులభించిన
ప్రియనేస్తాలు
పూలంటే ఇష్టము
పరమాత్మునికే కాదు
పడతులకే కాదు
పరికించేవారందరికిను
పూలను మరువను
పువ్వుల వీడను
పువ్వులే నాప్రాణము
పువ్వులే నాలోకము
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment