ఓ చెలికాడా!
చెప్పనా
నిన్నచేసిన
నీఘనకార్యాలను చెప్పనా
చెయ్యనా
నామదినివిప్పి
నీగుట్టును రట్టుచెయ్యనా
తెల్పనా
నిన్నరాత్రి కలలోకొచ్చి
నువ్వుచేసిన చిలిపిపనులను తెల్పనా
తీర్చనా
నీవు కోరినకోర్కెలను
నిండుగా తీర్చనా
ఇవ్వనా
నీకుముద్దులనివ్వనా
నినుమురిపించనా
చిందనా
చిరునవ్వులను
మోమునిండా చిందించనా
ఆడనా
సరసాలాడనా
సరదాలు చేయనా
రానా
మసకమసక చీకటిలో
మల్లెపందిరిక్రిందకు రానా
విహరిద్దామా
చక్కని చంద్రునిక్రింద
చల్లన వెన్నెలలోన విహరిద్దామా
చెలికాడా
చెంతకుపిలవకురా
చేయినిచాచకురా
కన్నుగీటకురా
కబుర్లుచెప్పకురా
కవ్వించకురా
మురిపించకురా
మరిపించకురా
మనసుదోచుకోకురా
నలుగురిలో
నను
నగుబాటుచేయకురా
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment