నిరీక్షణ
నీ నవ్వులన్నీ
నాకోసమేనని
నేను నమ్ముతున్నా
నీ అందాలన్నీ
నావేనని
నేను అదృష్ట్తవంతుడననుకొనుచున్నా
నీ ప్రేమంతా
నామీదనేనని
నేను తలపోస్తున్నా
నీ పలుకులన్నీ
నిజమేనని
నేను అనుకుంటున్నా
నీ చేతలన్నీ
నాకోసమేనని
నేను నిర్ణయించుకున్నా
నువ్వు పుట్టింది
నాకోసమేనని
నేను భావిస్తున్నా
నీ ఆలోచనలన్నీ
నాపైనేనని
నేను విశ్వసిస్తున్నా
నీ చూపులన్నీ
నాపైనేనని
నేను నిర్ధారించుకున్నా
నువ్వే
నాతోడూ
నాజోడూ అనిపరిగణిస్తున్నా
నువ్వులేనిదే
నేనుండలేనని
నీకు తెలియపరుస్తున్నా
నీ సమ్మతికోసం
నేను ఎన్నిరోజులయినా
నిరీక్షిస్తుంటా
నెచ్చెలి
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment