చక్కనైన చిన్నది
ఎచటనుండి వీచెనో
ఈ చల్లని గాలి
ఎచటనుండి వచ్చెనో
ఈ చక్కని చిన్నది
చిరునగవులు మోమున
చిందిస్తున్నది
అందాలను అన్నింటిని
ఆరబోస్తున్నది
తెల్లచీరనుకట్టి
వెలిగిపోవుచున్నది
మల్లెపూలనుపెట్టి
మనసునుమురిపిస్తున్నది
ఇంతలేసి కన్నులతో
ఇంపుగానున్నది
అంతులేని ఆలోచనలతో
అంతరంగాన్ని తట్టుచున్నది
ముచ్చటైన కురులను
ముడివేసియున్నది
కలువలాంటి కన్నులతో
కళకళలాడుచున్నది
మధురమైన మాటలతో
మత్తెక్కిస్తున్నది
ముచ్చటైన చూపులతో
మరులుకొలుపుచున్నది
అందమైన నడకలతో
అలరిస్తుయున్నది
అప్సరసలాంటి అందాలతో
ఆకట్టుకుంటున్నది
ప్రేమను పంచుతున్నది
ప్రియమును పెంచుతున్నది
తలను తిప్పనీయకున్నది
తృప్తిని కలిగిస్తున్నది
శిరసువంచియున్నది
సిగ్గుపడుచున్నది
వలనువిసురుతున్నది
వలపులోకిదించుచున్నది
చిన్నదాన్ని చూడకుండా
ఉండేదెట్లా
మనసుకు కళ్ళెమును
వేసేదెట్లా
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment