పూలబాణాలు
ఎవరో
పూలబాణాలను సంధించారు
ఎందుకో
కవితాకన్యను తలపించారు
పుష్పబాణాలు
గుండెకు గుచ్చుకున్నాయి
కొత్తకోర్కెలు
మదిలో మొలుచుకొచ్చాయి
అందాలసుందరి
ఆకర్షించింది
ఆయస్కాంతాన్ని
అధికమించింది
చిరునవ్వులను
చిందింది
చిత్తమును
స్వాధీనంచేసుకుంది
తేనెచుక్కలను
మాటల్లోచల్లింది
తీయదనమును
రుచిచూపింది
ఓరచూపులను
విసిరింది
వయ్యారాలను
ఒలకబోసింది
కన్ను
గీటింది
చేయి
పట్టింది
వలను
విసిరింది
లక్ష్యాన్ని
సాధించింది
చెంతకు
వచ్చింది
చెలిమిని
చేసింది
మనసులు
కలిపింది
మేనును
మురిపించింది
అక్షరాలు
అల్లుకున్నాయి
పదాలు
పేరుకున్నాయి
పలుకవితలు
పుట్టాయి
పలువురిని
పరవశింపజేశాయి
పువ్వుకు
ప్రేమకు
బంధము
ఏమిటో
అందానికి
ఆనందానికి
సంబంధము
ఏమిటో
చెలికి
చెలికానికి
చెలిమి
ఎందుకో
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment