పూలుతేరా చెలికాడా!


తాజాతాజా పూలను

తోటకువెళ్ళి 

తెంచుకొని 

తేరా చెలికాడా....


తేటులు తాకని

కన్యపూలను

దుమ్ముధూళిసోకని 

పూలనుతేరా చెలికాడా....


తలలోన పూలను

తురుమురా

తేటతెల్లముగా నీప్రేమను

తెలుపురా చెలికాడా....


కొప్పులోన

కుసుమాల మాలనుగుచ్చి

కోమలి అందాలను

కాంచరా చెలికాడా....


తెల్లవారిందిరా

తోటనుండి

పూలనుతెచ్చి

ఇవ్వరా చెలికాడా....


తెల్లను మల్లెలు

తేరా చెలికాడా

వసంతమాసం

వచ్చిందిరా చెలికాడా...


ప్రేమించి పూలిచ్చి

తుంటరిపనులకు

పాల్పడుకురా 

చిలిపిచేష్టల చెలికాడా....


నువ్వే నేనై

నేనే నువ్వై

ఒకరికి ఒకరై

ఇద్దరంఒకటై పోదామురా చెలికాడా....


తలపులలో మునిగి

తనువులను కలిపి

గాలిలోన తేలిపోయి

గగనంలో విహరిద్దామురా చెలికాడా....


పూవుకు తావిలా

తావికి పూవులా

ఒకటై పోదామురా

రారా చెలికాడా....


తక్షణమే రారా

తాత్సారం చేయకురా

తరుణమిదేరా

తప్పకరారా చెలికాడా....


తరుణిమనసును

తెలుసుకోరా

తరుణిచేతిని

చేపట్టరా చెలికాడా....


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం



Comments

Popular posts from this blog