నాహృదయం
నా మనసు
పూలకు తెలుసో లేదో కాని
ప్రతి ఆకుకు తీగకు తెలుసు
తోటకంతా తెలుసు
నా ప్రేమ
ప్రేయసికి తెలుసో లేదో కాని
ముందువెనుకప్రక్కన ఉన్నవారందరికి తెలుసు
ఊరంతా తెలుసు
నా ఆలోచనలు
మనసుకు తెలుసో లేదో కాని
అందానికి ఆనందానికి తెలుసు
సందేశాలకు సర్వంతెలుసు
నా గానం
కోకిలలకు తెలుసో లేదో కాని
స్నేహితులకు శ్రోతలకు తెలుసు
సరస్వతీపుత్రులందరికి తెలుసు
నా పేరు
మీకు తెలుసో లేదో కాని
నన్ను చూచినవారికి విన్నవారికి తెలుసు
నన్ను తెలుసుకున్నవారందరికి తెలుసు
నా కష్టం
కవితలకు తెలుసో లేదో కాని
అక్షరాలకు పదాలకు తెలుసు
భావాలకు పూర్తిగా తెలుసు
నా కూర్పులు
శ్రావ్యతకు తెలుసో లేదో కాని
ఆదిప్రాసలకు అంత్యప్రాసలకు తెలుసు
పదప్రయోగాలకి తెలుసు
నా వ్రాతలు
కలానికి తెలుసో లేదో కాని
చేతికి మనసుకి తెలుసు
వంటికంతా తెలుసు
నా కవితలు
కల్పనకు తెలుసో లేదో కాని
ముఖపుస్తక వాట్సప్పు సభ్యులకు తెలుసు
సాహిత్యలోకానికి తెలుసు
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment