పూలపరవశాలు
పూలు
ప్రకాశిస్తున్నాయి
పొంకాలను
ప్రదర్శిస్తున్నాయి
విరులు
విచ్చుకున్నాయి
వేడుకచేస్తున్నాయి
వినోదపరుస్తున్నాయి
కుసుమాలు
కళ్ళను కట్టిపడవేస్తున్నాయి
మహదానందమునిచ్చి
మనసును మురిపిస్తున్నాయి
అలరులు
అలరిస్తున్నాయి
అంతరంగంలో
అలోచనలను లేపుతున్నాయి
సుమాలు
సుందరంగావున్నాయి
సుగంధాలను చల్లుతున్నాయి
సంతసపరుస్తున్నాయి
లతాంతాలు
లలితంగావున్నాయి
లాలిస్తున్నాయి
లాస్యమాడుతున్నాయి
ప్రసూనాలు
పరాచకాలాడుతున్నాయి
ప్రక్కకురమ్మంటున్నాయి
పూలపాటను పాడమంటున్నాయి
పూలతో
ముచ్చటలాడుతా
పూలలోకంలో
పయనిస్తా
పూలకోర్కెలను
తీరుస్తా
పూకన్యలను
ప్రమోదపరుస్తా
పూబాలలను
పొగుడుతా
పూలప్రాశస్త్యాన్ని
పదిమందికి చెబుతా
పూలకవితలు
వ్రాస్తా
పలువురితో
పంచుకుంటా
పాఠకులకు
పంపుతా
పదేపదే
పఠింపజేస్తా
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment