పువ్వుపువ్వు
పువ్వుపువ్వు
చూపేను
సుందరరూపాలు
చక్కనివర్ణాలు
పువ్వుపువ్వు
మీటేను
మమతలను
మనసులను
పువ్వుపువ్వు
కట్టేసేను
కళ్ళను
కాళ్ళను
పువ్వుపువ్వు
ఇచ్చేను
సంతసాలను
సౌందర్యాలను
పువ్వుపువ్వు
వీచేను
చందనపరిమళాలు
వసంతవీచికలు
పువ్వుపువ్వు
చిందేను
తేనెచుక్కలు
చిరునవ్వులు
పువ్వుపువ్వు
చెప్పేను
ప్రీతిపలుకులు
ముద్దుముచ్చటలు
పువ్వుపువ్వు
పలికేను
కోకిలగానం
సన్నాయిరాగం
పువ్వుపువ్వు
మయిమరిపించేను
మురిపించేను
మెరిపించేను
పువ్వుపువ్వు
విచిత్రము
విలక్షణము
విన్నూతనము
పువ్వుపువ్వును
చూడు
ఆనందాలను
పొందు
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment