ఆడవాళ్ళు


ఎవరన్నారు

ఆడవాళ్ళను

అవమానిస్తున్నారని 

వారు ఉత్తమసగాలు


ఎవరన్నారు

ఆడవాళ్ళను

అనుమానిస్తున్నారని

వాళ్ళు నిజాయితీపరులు


ఎవరన్నారు

ఆడవాళ్ళను 

అగౌరవపరుస్తున్నారని

వారు సంస్కారవంతులు 


ఎవరన్నారు

ఆడవాళ్ళను

అమాయకులని

వారు బహుమేధావులు


ఎవరన్నారు

ఆడవాళ్ళకు

ఆర్ధికస్వాతంత్రంలేదని

వారు ఇళ్ళకు ఆర్ధికమంత్రులు


ఎవరన్నారు

ఆడవాళ్ళకు

అవకాశాలులేవని

వాళ్ళు అన్నింటిలోముందున్నారు


వినలేదా

ఆడవాళ్ళు

ముందని

అది మర్యాదకాదా


వినలేదా

ఆడవాళ్ళకు 

జోహార్లని

అది గొప్పతనంకాదా


వినలేదా

ఆడవాళ్ళు

ఇళ్ళకు దీపాలని

అది ఘనతకాదా


వినలేదా

ఆడవాళ్ళు

మన ఇంటిమహలక్ష్ములని

అది మంచిమాటకాదా


వినలేదా

ఆడవాళ్ళు

మన ఇంటిదేవతలని

అది వారికిచ్చినమర్యాదకాదా


వినలేదా

ఆడవాళ్ళు 

ఆలోచనాపరులని

అది వారికిప్రతిష్ఠకాదా


ఆడవాళ్ళు

అన్ని

ఉద్యోగాలలో 

ఉన్నారుకదా


ఆడవాళ్ళు

అన్నిటా

సగభాగం 

అన్నారుకదా 


అందుకే

ఆడవాళ్ళు

మీకుజోహార్లు

అంటాను


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం



Comments

Popular posts from this blog