ఆపువ్వు
ఆపువ్వు
నవ్వుతుంది
నన్ను
ఆకర్షిస్తుంది
ఆపువ్వు
పలుకరిస్తుంది
నన్ను
పరవశింపజేస్తుంది
ఆపువ్వు
పిలుస్తుంది
నాతోడును
కోరుకుంటుంది
ఆపువ్వు
సుగంధం చల్లుతుంది
నన్ను
సంతోషపరుస్తుంది
ఆపువ్వు
వెలుగులు చిమ్ముతుంది
నన్ను
చూడమంటుంది
ఆపువ్వు
రంగులు అద్దుకుంది
నన్ను
మురిపిస్తుంది
ఆపువ్వు
గాలికి ఊగుతుంది
నామనసును
ఊయలలా ఊపుతుంది
ఆపువ్వు
అందంగా ఉన్నది
నాకళ్ళను
కట్టిపడవేస్తుంది
ఆపువ్వు
నన్ను ప్రేమిస్తుంది
నాకు
బాగా నచ్చింది
ఆపువ్వే
నా ప్రాణం
ఆపువ్వే
నా లోకం
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment