నా సాహితి
నాకై
పువ్వై
నవ్వై
వచ్చె నాసాహితి
నాకై
తేనై
తీపై
మాటలయ్యె నాసాహితి
నాకై
గాలై
గంధమై
వీచె నాసాహితి
నాకై
వెలుగై
తోడై
దారిచూపె నాసాహితి
నాకై
కోకిలై
గానమై
వినిపించె నాసాహితి
నాకై
నెమలై
నాట్యమై
మురిపించె నాసాహితి
నాకై
అప్సరసై
అందమై
ఆనందమిచ్చె నాసాహితి
నాకై
ప్రేయసై
ప్రియమై
పరవశపరచె నాసాహితి
నాకై
అక్షరాలై
పదాలై
కవితలయ్యె నాసాహితి
నాకై
ఊహలై
భావాలై
కమ్మనికైతలయ్యె నాసాహితి
సాహితి నా కాంతి
సాహితి నా శాంతి
సాహితి నా స్ఫూర్తి
సాహితి నా సంపత్తి
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment