మల్లీ మాఊరిమల్లీ!

(ప్రేమగీతం)


మల్లీ మాఊరిమల్లీ

మాటలూ చెప్పింది

మనసునూ దోచింది

మల్లీ మాఊరిమల్లీ  ||మల్లీ||


మాపుటేళకు రమ్మంది

మల్లేపూలను తెమ్మంది

మాటుచోటుకు రమ్మంది

ముచ్చటగతయారయి రమ్మంది ||మల్లీ||


ముచ్చటలు చెప్పింది

ముద్దులును ఇచ్చింది

మనసార నవ్వింది

మురిపెమూ చేసింది  ||మల్లీ||


మరుసటిరోజున రమ్మంది

మంచిచీరెను తెమ్మంది

మొహమాట మొద్దంది

మోసమూ చెయ్యొద్దంది ||మల్లీ||


మురిసిపోదామంది

మెరిసిపోదామంది

మాటివ్వమంది

మరచిపోవద్దంది  ||మల్లీ||


మూతిముడవద్దంది

మౌనమూదాల్చొద్దంది

ముక్కుమీదకోపమొద్దంది

మాటిమాటికి అలగొద్దంది ||మల్లీ||


మమతను చాటింది

మోహినీ అయ్యింది

మాత్సర్యమొద్దంది

మిడిసిపాటొద్దంది ||మల్లీ||


మాఘమాసమొచ్చిందంది

మనుమాడదామంది

ముహూర్తమును పెట్టించమంది

మెడవంచుతా తాళికట్టామంది ||మల్లీ||


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం



Comments

Popular posts from this blog