బావా ఓబావా!

(ప్రేమగీతం)


రమ్మంటావా బావా

పొమ్మంటావా బావా

దగ్గరకు రమ్మంటావా బావా

దూరంగా పొమ్మంటావా బావా||రమ్మ||


సయ్యంటావా బావా

నయ్యంటావా బావా

పెళ్ళికి సయ్యంటావా 

చెలిమికి నయ్యంటావా


ఒప్పుకుంటావా బావా

తప్పుకుంటావా బావా

వలపుకు ఒప్పుకుంటావా

బరువుకు తప్పుకుంటావా


పెంచుకుందామా బావా

తెంచుకుందామా బావా

ప్రేమను పెంచుకుందామా

బంధము తెంచుకుందామా


ఆడుకుందామా బావా

పాడుకుందామా బావా

ఆటలు ఆడుకుందామా

పాటలు పాడుకుందామా


తోటకెళ్దామా బావా

చాటుకెళ్దామా బావా

మల్లెపూల తోటకెళ్దామా

పూలచెట్టు చాటుకెళ్దామా


చూపమంటావా బావా

ఇవ్వమంటావా బావా

అందము చూపమంటావా

ఆనందం ఇవ్వమంటావా


మాటలొద్దురా బావా

చేతలుచూపరా బావా

వట్టిమాటలు వద్దురా

గట్టిచేతలు చూపరా  ||రమ్మ||


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం


గప్ చుప్ సంబారు బుడ్డీ

నోటిమీద వేలేసుకోండి

వేళాపాళలేదు

కళ్ళురెండుమూసుకోండి


పాటను చదవండి

మీరే పాడుకోండి

ఆనందం పొందండి

మీరూ మురిపించండి



Comments

Popular posts from this blog