నా అందాలరాశి నా ఆనందాలగని


అదిగో అదిగో

ఆచిత్తరువును చూడండి

అందాలను కనండి

ఆనందమును పొందండి


తేరపారచూచే 

కళ్ళా ఆమెవి

కాదు కాదు

విరబూచిన కలువలు


సిగ్గుపడిన

బుగ్గలా ఆమెవి

కాదు కాదు

ఎర్రని గులాబిమొగ్గలు


సుందరమైన

మోమా ఆమెది

కాదు కాదు

పున్నమిచంద్రుని ప్రతిబింబము


తెల్లని

పళ్ళా ఆమెవి

కాదు కాదు

మెరుస్తున్న ముత్యాలు


నుదుటనున్న

సింధూరమా అది

కాదు కాదు

ఉదయిస్తున్న సూర్యబింబము


ఎర్రని

పెదవులా ఆమెవి

కాదు కాదు

పండిన దొండపండ్లు


చిందిస్తున్నవి

చిరునవ్వులా అవి

కాదు కాదు

నిండుపున్నమి వెన్నెల


ప్రకాశించే

వర్ణమా ఆమెది

కాదు కాదు

మేలు బంగరుఛాయ


ఆమె 

అందాలరాశి

సుగుణాలవాసి

ఆనందాలగని


శారదాపతి

చేసినబొమ్మ

ప్రతిసృష్టిని

చేయబోయేఅమ్మ


ఆమెను

అక్కునచేర్చుకుంటా

అంగములో

అర్ధభాగమిస్తా


అందరిముందు

ఆమెకుతాళికడతా

అందరిచేత

అక్షింతలువేయించుకుంటా


కాపురానికి

తెస్తా

గృహలక్ష్మిని

చేస్తా


నేను

ప్రకృతి ప్రేమికుడిని

అందాల ఆరాధకుడిని

ఆనందాల పిపాసకుడిని


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం



Comments

Popular posts from this blog