సమయసందర్భము కవిగారికవనము
ఒక వెలుగు
ప్రసరించి
ఒక చర్యకు
ఉసిగొలుపుతుంది
ఒక క్షణం
రెచ్చగొట్టి
ఒక పనిని
పురమాయిస్తుంది
ఒక అందం
కనపడి
ఒక ఆనందం
కలిగిస్తుంది
ఒక కన్యక
కలలోకివచ్చి
ఒక కవిని
కవ్విస్తుంది
ఒక పువ్వు
ప్రత్యక్షమయి
ఒక మనసును
వ్రాయమంటుంది
ఓక చెలి
ఊరించి
ఒక హృదయాన్ని
కలంపట్టిస్తుంది
ఒక ఊహ
తట్టి
ఒక కైతను
పుట్టిస్తుంది
ఒక భావం
నచ్చి
ఒక మనసును
ముచ్చటపరుస్తుంది
ఒక సమయము
అనుకూలిస్తుంది
ఒక సందర్భము
అనుగ్రహిస్తుంది
ఒక మనసు
చలిస్తుంది
ఒక కవిత
జనిస్తుంది
ఒక నిమిషం
వినోదాన్నిస్తుంది
ఒక ఘటన
విషయాన్నిస్తుంది
ఓ కవీ!
సమయసందర్భాలను
గమనించు
సమయోచితకవనమును
కొనసాగించు
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment