అన్నీ నీవిరా!


అంతా నీదే 

అన్నీ నీవే

అందరు నీవారే

అన్నీ నీకేలే


వడివడి అడుగులు

వేయరా

వచ్చే కాలం 

నీదిరా


గాలినీదిరా 

ప్రాణంనీదిరా

వాననీదిరా 

నీళ్ళునీవిరా


పుడమినీదిరా 

పంటనీదిరా

నిప్పునీదిరా 

వెలుగునీదిరా


నింగినీదిరా 

తారకలునీవిరా

జాబిలినీదిరా 

రవినీవాడురా 


పెళ్ళాంనీదిరా 

కుటుంబంనీదిరా

అమ్మనీదిరా 

నాన్ననీవాడురా


అక్కనీదిరా 

అన్ననీవాడురా

చెల్లెలునీదిరా 

తమ్ముడునీవాడురా


కూతురునీదిరా

అల్లుడు నీవాడురా

కొడుకు నీవాడురా

కోడలు నీ ఇంటిలక్ష్మిరా  


ఇల్లు నీదిరా

ఊరు నీదిరా

దేశం నీదిరా

లోకం నీదిరా


జీవితం నీదిరా

హాయిగా గడపరా

ముందుకు నడవరా

గమ్యము చేరురా


ఆటుపోట్లకు 

అదరకురా

కష్టనష్టాలకు 

కలతచెందకురా


భయభ్రాంతులకు 

బెదరకురా

అపజయ అవమానాలకు 

కృంగిపోకురా


అక్షరాలు 

నీవిరా

పదాలు 

నీవిరా 


ఊహలు 

నీవిరా

భావాలు 

నీవిరా


కవితలు 

వ్రాయరా

గానము 

చేయరా


అంతా నీదే 

అన్నీ నీవె

అందరు నీవారే

అన్నీ నీకోసమే


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం



Comments

Popular posts from this blog