తాయిలాలు


రారండోయ్

తాయలాలను ఇస్తా

చదవండోయ్

తాయిలాలగూర్చి చెబుతా


తాయిలాలు ఇస్తేగాని

చిన్నారులు

ఏడుపు మానరు

చెప్పింది వినరు


తాయిలాలు ఇస్తామంటేగాని

వోటర్లు బూతులకురారు

వోట్లు వెయ్యరు

నేతలను ఎన్నుకోరు


తాయిలాలు అందిస్తేగాని

సభలకు 

జనాలురారు

చెప్పిందివినరు


తాయిలాలకోసమే

భట్రాజులు

పొగుడుతారు

భజనలుచేస్తారు


తాయిలాలు లేకపోతే

చెలియ

చెంతకురాదు

చెలిమినిచేయదు


తాయిలాలు

ఫలం పత్రం పుష్పం

తోయిదం ఇవ్వనిదే

పరమాత్ముడు కరుణించడు


తాయిలాలు

శాలువాలు శ్లాఘనలు సన్మానసత్కారాలు

ప్రశంసాపత్రాలు బహుమతులు లేనిదే

కవులు సమ్మేళనాలలో పాల్గొనరు


తాయిలాలంటే

ఉచిత తినుబండారాలు 

పొగడ్తలు ప్రలోభాలు

నమస్కారాలు నగదుసమర్పణ 


నాకూ

పాఠకులారా

తాయిలాలిస్తారా

అందలమెక్కిస్తారా

ఆనందంకలిగిస్తారా


మీకూ

తెలుగుతియ్యదనాలిస్తా

మాటలమూటలిస్తా

విషయచింతనకలిగిస్తా

మనసులదోచుకుంటా


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం


Comments

Popular posts from this blog