ఎవరో ఎవరో?
పున్నమివెన్నెలను
పట్టకొచ్చి
ఆమెమోముమీద
పూసిందెవరో
పాలపొంగును
పట్టకొచ్చి
ఆమెఎదలో
దాచిందెవరో
తారకలనుతెచ్చి
హారముగాగుచ్చి
ఆమెమెడలో
వేసిందెవరో
కొప్పులో
పెట్టుకోమని
కోమలకుసుమాలను
పూయించెదెవరో
అమృతాన్ని
పట్టకొచ్చి
ఆమెఅధరాలను
నింపిందెవరో
తేనెచుక్కలను
తీసుకొచ్చి
ఆమెనోటిలో
దాచిందెవరో
కడలికెరటాలను
మొసకొచ్చి
ఆమెగుండెలో
పెట్టిందెవరో
కాంతికిరణాలను
తీసుకొచ్చి
ఆమెకళ్ళను
వెలిగించిందెవరో
బంగారాన్ని
కరిగించి
ఆమెమేనుకు
తాపడంచేసిందెవరో
సెలయేటి
ప్రవాహానితెచ్చి
ఆమెప్రాయంలో
పెట్టిందెవరో
అన్నిఅందాలను
ఏరికోరి
ఆమెవంటిలో
కూర్చిందెవరో
అందచందాలను
కళ్ళకుచూపించి
నన్నుఆమెను
కట్టుకోమన్నదెవరో
పెళ్ళికి ఒప్పుకున్నందుకు
ఆమెకు ధన్యవాదాలు
అందాలను సృష్టించినందుకు
ఆదేవదేవునికి వందనాలు
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment