ఓహో గులాబిబాల!

(గులాబి కబుర్లు)


గులాబి

ఆహ్వానిస్తున్నది

అలోచనలురేపుతున్నది


గులాబిపువ్వు

ఉత్సహపరుస్తున్నది

ఊసులుచెప్పమంటున్నది


గులాబిపూవు 

మెరుస్తున్నది

మురిపిసున్నది


గులాబిపుష్పం

విచ్చుకున్నది

వినోదపరుస్తున్నది


గులాబికుసుమం

చేతిలోకి తీసుకోమంటున్నది

చెలికొప్పులో తురుమమంటున్నది


గులాబిరంగు

కళ్ళని కట్టేస్తున్నది

కమ్మదనాన్ని చూపిస్తున్నది


గులాబిరేకులు

అందాలను వెదజల్లుతున్నాయి

ఆనందాన్ని కలిగిస్తున్నాయి


గులాబికన్యక

అత్తరు చల్లుచున్నది

మత్తులో పడవేస్తున్నది


గులబిబాల

గుబులు పుట్టిస్తున్నది

గుండెకు గాయంచేస్తున్నది


గులాబికన్నియ

గుండెకు హత్తుకున్నది

చెంతకు రమ్మంటున్నది


గులాబిరాణి

రాలేదని గుర్రుగుర్రుమంటున్నది

రాకపోతే ముల్లుగుచ్చుతానంటున్నది


గులాబికన్య

కలం పట్టమంటున్నది

కవిత వ్రాయమంటున్నది


గుండ్లపల్లి రాజేంద్రప్రాద్, భాగ్యనగరం



Comments

Popular posts from this blog