నేను నాఅలోచనలు
అందాలు
అలరిస్తే
ఆనందపడతా
అందరిని ఆహ్లాదపరుస్తా
పువ్వులు
పరిమళాలు చల్లితే
ఆఘ్రానిస్తా
అందరికి అందిస్తా
నవ్వులు
వెలుగులు చిమ్మితే
ప్రకాశించిపోతా
ప్రక్కనున్నవారిని పరవశింపజేస్తా
చెలి
చెంతకొస్తే
సరసాలాడతా
ప్రణయకవితను వ్రాస్తా
పలుకులు
తేనెలు చిందితే
ఆస్వాదిస్తా
అందరికి పంచుతా
అక్షరపుష్పాలు
అందుబాటులోకొస్తే
అల్లుతా మాలగా
అమ్మసరస్వతి మెడలోవేస్తా
పదాలప్రాసలు
పొసిగితే
ప్రయోగిస్తా
పలువురిని పులకరింపజేస్తా
కవిత
కవ్విస్తే
కలంపడతా
కాగితాలు నింపేస్తా
కవిగా
కనిపించకుండా
వినిపిస్తా
వినోదపరుస్తా
మనసులను
ముట్టేస్తా
శాశ్వతస్థావరాన్ని
సంపాదించుకుంటా
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment