రంగేళీ
వెలుగులోని తెలుపునై
చీకటిలోని నలుపునై
చీకటివెలుగుల రంగేళీనై
ప్రభవిస్తా
ఆకులలో పచ్చదనాన్నై
పువ్వులలో రంగునై
మొక్కలలో ప్రాణాన్నై
ముచ్చటపరుస్తా
ఆకాశంలో నీలిరంగునై
హరివిల్లులో సప్తవార్ణాలనై
కళ్ళల్లో కాంతినై
కళకళలాడుతా
పాటలలో పల్లవినై
మాటలలో తేనియనై
ఆటలలో ప్రతిభనై
అలరిస్తా
పాడుతా కోకిలనై
నాట్యంచేస్తా నెమలినై
నడకలునేర్పుతా హంసనై
రంజింపజేస్తా రసికుడనై
మురిపిస్తా వధువునై
తూలిస్తా మధువునై
మురిపిస్తా ముగ్ధనై
ముచ్చటపరుస్తా ముద్దునై
మనసులో తలపునై
చేతిలో కలమునై
పదాలతో కవితనై
చదివిస్తా సంతసపరుస్తా
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment