ఓ సఖీ!
నీ చంద్రవదనం చూడాలని
నిన్ను చిరునవ్వులు చిందమంటే
నువ్వు ఏడుపుముఖం పెడితే
నేను ఏలా తృప్తిపడేది సఖీ?
నీతో కాలం గడపాలని
నిన్ను దగ్గరకు రమ్మంటే
నువ్వు దూరంగా జరిగితే
నేను ఏలా కోరికతీర్చుకునేది చెలీ?
నీతో సరదాగ ఉండాలని
నిన్ను కబుర్లు చెప్పమంటే
నువ్వు మూతిబిగించి మౌనందాలిస్తే
నేనెలా భరించేది ప్రియా?
నిన్ను అందంగా చూడాలని
నీకు మల్లెమాలను అందిస్తే
నువ్వు కొప్పులో పెట్టుకోకపోతే
నేను ఏలా తట్టుకోగలను సఖియా?
నిన్ను ఆనందపరచాలని
నీకు పట్టుచీరను కొనిస్తే
నువ్వు కట్టుకోనని మొండికేస్తే
నిన్ను ఏలా అర్ధంచేసుకోవాలి చెలియా?
నీపై చక్కని కవితనువ్రాసి
నీకు వినిపించాలని చదువుతుంటే
నువ్వు కళ్ళుచెవ్వులు మూసుకుంటే
నేను ఏలా కవనంసాగించాలి ప్రియురాలా?
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం

Comments
Post a Comment