సినారె
(సింగిరెడ్డి నారాయణరెడ్డి గారు)
మనకు గర్వకారాణం
మన సినారే
మనతెలుగుబాషకు ఒకవరం
మన సినారే
తెలుగుజాతి మనది
నిండుగ వెలుగుజాతి మనది
అని చాటిచెప్పినవాడు
మన సినారే
నన్ను దోచుకుందువటే వన్నెల దొరసానీ
అంటు సినీపాటలరచయతగా
ప్రవేశము చేసినవాడు
మన సినారే
పెక్కు పుస్తకాలు కమ్మని కవితలు
వ్రాసినవాడు మన సినారే
పలు బిరుదులు సత్కారాలు
పొందినవాడు మన సినారే
తెలుగు బాషకు పేరు ప్రఖ్యాతులు
తెచ్చినవాడు మన సినారే
తెలుగునాట యువకవులను
ప్రోత్సహించినవాడు మన సినారే
తెలుగులో గజల్లు వ్రాసి
ఘనకీర్తిని సాధించినవాడు మన సినారే
తెలుగు సాహిత్యంలో శాశ్వతస్థానం
సంపాదించినవాడు మన సినారే
ఙ్ఞానపీఠ పురస్కారాన్ని
పొందినవాడు మన సినారే
పద్మభూషణ్ బిరుదునుపొంది
సత్కరించబడినవాడు మన సినారే
విశ్వంభర కావ్యాన్ని వ్రాసి
విశిష్ట పేరును పొందినవాడు మన సినారే
కర్పూర వసంతరాయలు గేయకావ్యాన్ని వ్రాసి
కడుఖ్యాతిని పొందినవాడు మన సినారే
సినారే ఘటికుడు
సినారే అమరుడు
సినారే సరస్వతీపుత్రుడు
సినారే సాహితీసేవకుడు
సినారేను నేడు
స్మరించుకుందాం
సినారేకు నేడు
శ్రద్ధాంజలి ఘటిద్దాం
సినారే
ఘనారే
సినారే
భళారే
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
9177915285

Comments
Post a Comment