శృతిమించినరాగం


అరుణోదయం అయ్యింది

పుడమి పులకరించింది

పూలు వికసించాయి

ప్రకృతి పరవశించింది


అందం తొంగిచూచింది

ఆనందం వెల్లివిరిసింది

హృదయం పొంగిపోయింది

అంతరంగం వలలోపడింది


రాగం శృతిమించింది

ప్రేమ హద్దులుదాటింది

వయసు తొందరచేసింది

మనసు మాయలోపడింది


కోర్కె వెంటబడింది

తపన ఎక్కువయ్యింది

తరుణి తటస్థించింది

తనువు తృప్తిపడింది


జత కుదిరింది

జంటను చేసింది

ఝుంకారం వినిపించింది

జగతి మురిసింది


దేవుడు కరుణించాడు

ముత్యాలజల్లు కురిపించాడు

దీవెనెలు అందించాడు

మనసులు మురిపించాడు


శృతి కలిసింది

స్మృతిలో నిలిచింది

శ్రావ్యత కలిగింది

శ్రవణానందం అయ్యింది


ప్రేమ ఫలించింది

కధ సుఖాంతమయ్యింది

కవిత పుట్టకొచ్చింది

కమ్మదనాన్ని ఆస్వాదించమంది


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం



Comments

Popular posts from this blog