నాచెలి కబుర్లు
నా చెలికి
సొగసు ఎక్కువ
పొగరు తక్కువ
నా సఖికి
మాటలు తక్కువ
మధురం ఎక్కువ
నా ప్రేయసికి
షోకులు ఎక్కువ
సరసాలు తక్కువ
నా ప్రియురాలుకు
కోర్కెలు ఎక్కువ
ఓపిక తక్కువ
నా చెలియకు
ఆశలు ఎక్కువ
శక్తి తక్కువ
నా నెచ్చెలికి
ఆకలి ఎక్కువ
తినేది తక్కువ
నా సకియకు
చదువు ఎక్కువ
జీతం తక్కువ
నా జవరాలుకు
తొందర ఎక్కువ
చేసేది తక్కువ
నా ప్రేమికురాలుకు
కలికితనం ఎక్కువ
చిలిపితనం తక్కువ
నా ప్రియకు
తపన ఎక్కువ
తృప్తి తక్కువ
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment