ముక్కుసూటిగా నడుస్తా!


ఏఎండకు ఆగొడుగు 

ఎత్తను

మదిలోని అభిప్రాయాలను

మార్చను


అన్యాయాలు చేసేవారిని

మెచ్చను

అబద్ధాలు చెప్పేవారిని

నచ్చను


అవినీతికి పాల్పడేవారిని

వ్యతిరేకిస్తాను

అక్రమాలు చేసేవారిని

ఆపేస్తాను


గొప్పలుచెప్పేవారిని

నోర్లుమూయిస్తాను

గోతులుతీసేవారిని

గట్టిగాఎదిరిస్తాను


స్వార్ధపరుల

పనిపడతాను

సొమ్ముకాజేసేవారల

ఆటలుకట్టిస్తాను


నాటకాలు ఆడేవారిని

నిలదీస్తాను

నమ్మకద్రోహం చేసేవారిని

నిలబెడతాను


కోతలు కోసేవారి

చిట్టాలు బయటపెడతాను

రాద్ధాంతం చేసెవారి

గుట్టును రట్టుచేస్తాను


యదర్ధవాది

లోకవిరోధి

అనేసామెతను

నిజమేనంటాను


తప్పనుకుంటే

నిలదీయొచ్చు

ఒప్పనుకుంటే

సమర్ధించొచ్చు


ముక్కుసూటి

మనస్తత్వం కలవాడను

మనసులోనున్నవిషయాన్ని

మాటల్లో చెబుతాను


ఆలోచనలను లేపితే

ఆనందిస్తాను

మనసులను తడితే

మురిసిపోతాను


మంచిభావము

ముఖ్యమంటాను

పదప్రయోగము

ప్రాముఖ్యమంటాను


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం



Comments

Popular posts from this blog