తెలుగుభేరి


నేనూ

తెలుగుభేరీని

సాహిత్యలోకాన మ్రోగించాను!


నేనూ

తెలుగుతల్లికి

కర్పూరహారతి నిచ్చాను!


నేనూ

తెలుగుసాహిత్యాన

దీపమొకటి వెలిగించాను!


నేనూ

తెలుగుభాషకీర్తిని

ఢంకాభజాయించి చెప్పాను!


నేనూ

తెలుగురుచిని

తోటివారికి పంచిపెట్టాను!


నేనూ

తెలుగుతీపిని

అఆలపై వెదజల్లాను!


నేనూ

తెలుగుశతకమొకటి

కలియుగశతకముపేరున వ్రాశాను!


నేనూ

తెలుగుప్రాసలను

వచనకవితలలో పారించాను!


నేనూ

తెలుగువెలుగులను

అంతర్జాలసమూహాలలో పెట్టాను!


నేనూ

తెలుగుఖ్యాతిని

వివిధకవితలలో చాటిచెప్పాను!


నేనూ

తెలుగుమాటలను

పరరాష్ట్రాలవారిచే పలికించాను!


నేనూ

తెలుగుతోటలో

పూలనుపూయించి సౌరభాలనువెదజల్లాను!


నేనూ

పలుతెలుగువారలను

పదప్రయోగాలతో పరవశింపజేశాను!


నేనూ

తెలుగుఅందాలను

భావకవితలలో చూపించాను!


నేనూ

తెలుగుమట్టిలోనే

కడకు కలసిపోతాను!


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం



Comments

Popular posts from this blog