ఓ చిలిపికనుల చినదానా!
చిలిపికనుల
చినదానా
ఎర్రబుగ్గల
నెఱజాణా
కులుకుతున్న
కుర్రదానా
సొగసులున్న
సుమబాలా
ఆచూపులోన
అందాలు విసిరావె
ఆమోములోన
ఆనందాలు చిందావె
ఆకళ్ళలోన
కాంతులు చూపావె
ఆనవ్వులోన
ఆశలను తెలిపావె
తలుపుప్రక్కన
తిన్నగానిలిచావె
తళతళలాడుతు
తన్మయత్వపరిచావె
చూపులువిసిరేవె
కవ్వించావె
కట్టిపడేశావె
కుతూహలపరచావె
తెల్లచీరకట్టి
నల్లరవికతొడిగి
అందాలుచిందావె
ఆనందమిచ్చావె
వాలుజడవేసి
వయ్యారాలొలికి
వలపువలవిసిరి
వినోదపరచావె
మెడలోన హారమేసి
చేతికి గాజులుతొడిగి
చెవులకు కమ్మలుపెట్టి
బంగారుఛాయలో వెలిగావె
కళ్ళకు కాటుకపెట్టి
నుదుటన బొట్టునుపెట్టి
పెదాలకు రంగునుపూసి
సోయగాలు చూపావె
ఫోజునుపెట్టి
ఫొటోలుదిగి
పొంకాలుచూపి
ప్రేమలోదించావె
ప్రేమగా పిలిస్తే
పలుకుతానె మరుక్షణం
కోరికి తెలిపితే
కలుస్తానె తక్షణం
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
ఆచిన్ని బొమ్మపై
అతిపెద్ద కవిత
ఆందాల రాశిపై
అపరూప వర్ణన
చదవండి
సమయంవెచ్చించండి
సంతసపడండి
చిత్తములోనిలుపుకోండి
కవిని
తలవండి
మనసున
నిలుపుకోండి
Comments
Post a Comment