పూలబంధం
ననలు
నన్ను బంధిస్తున్నాయి
నాతో కవితలువ్రాయిస్తున్నాయి
ఎందుకో?
కుసుమాలు
కనబడితే
కవితపుట్టకొస్తుంది
ఎందుకో?
పూలు
తలపుకొస్తే
భావాలు బయటకొస్తున్నాయి
ఎందుకో?
పూలు
పరిమళాలుచల్లితే
ప్రోత్సాహించినట్లుంటుంది
ఎందుకో?
అరులు
అందాలను ఆరబోస్తే
ఆలోచనలు పరుగెత్తుతున్నాయి
ఎందుకో?
పువ్వులు
పెటపెటలాడుతుంటే
పడతి ప్రాయానికొచ్చినట్లుంటుంది
ఎందుకో?
విరులు
విచ్చుకుంటే
మనసు మురిసిపోతుంది
ఎందుకో?
ననలు
నలిగితే
నాకు జాలివేస్తుంది
ఎందుకో?
విరులు
వాడిపోతే
విచారం కలుగుతుంది
ఎందుకో?
పూలు
పుడమిపైరాలితే
ప్రాణాలు గాలిలోకలిసినట్లనిపిస్తుంది
ఎందుకో?
పూలకవితలతో
పులకరింపజేస్తా
అక్షరసౌరభాలతో
అలరింపజేస్తా
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment