నేటి నేతలు
మేక గడ్డి తింటుంది
ఎద్దు మేత మేస్తుంది
గుర్రం దానా తింటుంది
నేత డబ్బును తింటాడు
పేను తలపై పెత్తనంచేస్తుంది
నల్లి మంచంపై పెత్తనంచేస్తుంది
శునకం తనవీధిపై పెత్తనంచేస్తుంది
నేత ప్రజలపై పెత్తనంచేస్తాడు
పిల్లికి పాలుకావాలి
జలగకు రక్తంకావాలి
కొంగకు చేపలుకావాలి
నేతకు వోట్లుకావాలి
ఉన్నవారు బ్రాందీవిస్కీ త్రాగుతారు
లేనివారు సారాయికల్లు త్రాగుతారు
తుమ్మెదలు పూలతేనెను త్రాగుతాయి
నేతలు ప్రజలరక్తం త్రాగుతారు
రోగి వ్యాధి తగ్గాలనుకుంటాడు
వరాహం బురద కోరుకుంటుంది
కడుపుకాలేవాడు అన్నం కావాలనుకుంటాడు
నేత పేరుప్రఖ్యాతులు కోరుకుంటాడు
త్రాగినోడు మత్తులో
తెలియక మాట్లాడుతాడు
నేత వోట్లకోసం
తెలిసీ నెరవేర్చలేనిహామీలిస్తాడు
నేతలను విశ్వసించకండి
నేతలమాటలను నమ్మకండి
నేతలను దారికితీసుకురండి
దేశాన్ని బాగుచేయండి
మంచినేతలు
క్షమించాలి
దుష్టనేతలు
పంధామార్చుకోవాలి.
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment