కవిగారి మనసు


కవిగారి మనసు

ఊగిసలాడుతుంది

ఉయ్యలలూగుతుంది


కవిగారి ఊహలు

ఉరుకుతున్నాయి

ఊరిస్తున్నాయి


కవిగారి అక్షరాలు

అల్లుకుంటున్నాయి

అలరిస్తున్నాయి


కవిగారి పదాలు

పారుతున్నాయి

పొసగుతున్నాయి


కవిగారి భావాలు

బయటకొస్తున్నాయి

భ్రమలోపడేస్తున్నాయి


కవిగారి కలము

పరుగెత్తుతుంది

పుటలపైగీస్తుంది


కవిగారి కవితలు

గాలిలా వీస్తున్నాయి

నీరులా ప్రవహిస్తున్నాయి


కవిగారి పాటలు

వినోదపరుస్తున్నాయి

వీనులకువిందునిస్తున్నాయి


కవిగారి పలుకులు

తేనెలుచిందుతున్నాయి

తేటతెలుగును తలపిస్తున్నాయి


కవిగారి కూర్పులు

అద్భుతము

అమోఘము


కవిగారి ప్రాసలు

సుందరము

శ్రావ్యము


కవిగారి కల్పనలు

కమనీయము

కడువిచిత్రము


కవిగారు అందరికి

అందాలుచూపిస్తున్నారు

ఆనందంకలిగిస్తున్నారు


కవిగారు అందరి

అంతరంగాలుతడుతున్నారు

ఆశ్చర్యపరుస్తున్నారు


కవిగారి మనసు

కవితా సాగరమా కావ్య రత్నగర్భమా యనుచు

పాఠకలోకం భావిస్తుంది 

సాహిత్యప్రపంచం విస్తుపోతుంది 


కవులకు జేజేలు

కవుల ఆలోచనలకు జేజేలు

కవుల వ్రాతలకు జేజేలు


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం



Comments

Popular posts from this blog